సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. రక్తదానంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

Blood Donation Camp on The Occasion of CM KCR Birthday Celebrations, CM KCR Birthday, CM KCR Birthday Celebrations, Harish Rao Donate Blood at Narayana Khed Govt Hospital, Harish Rao Donate Blood at Narayana Khed Govt Hospital on The Occasion of CM KCR, KCR Birthday Blood Donation Camp, KCR Birthday Celebrations, Mango News, Minister Harish Rao, Minister Harish Rao Donate Blood at Narayana Khed Govt Hospital on The Occasion of CM KCR Birthday Celebrations, Telangana CM KCR Birthday

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. సీఎం కేసీఆర్ రేపు (గురువారం, ఫిబ్రవరి 17) 68వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ అంతటా మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈమేరకు, మంగళవారం అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇదే క్రమంలో బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.

దీనిలో భాగంగా.. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం వారు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు అని కొనియాడారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధిలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. విద్యుత్ సంస్కరణలు, సాగునీటి ప్రాజెక్టులు, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, ఇలా అన్ని రంగాలలో, సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 7 =