బడ్జెట్ పై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్

CM KCR Instructions To Officials Over The State Budget, KCR Instructions To Officials Over The State Budget, Mango News Telugu, Telangana Budget 2019, Telangana CM KCR Instructions To Officials, Telangana CM KCR Instructions To Officials Over Budget, Telangana CM KCR Instructions To Officials Over The State Budget, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

బడ్జెట్ రూపకల్పనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీనియర్ అధికారులతో కలిసి సోమవారం ప్రగతి భవన్ లో కసరత్తు చేశారు. ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ వ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గత మార్చి నెలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయిలో బడ్జెట్ ను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొని ఉందని, అన్ని రంగాలపై దీని ప్రభావం పడి ఆదాయాలు బాగా తగ్గిపోయాయి. అన్ని రాష్ట్రాల్లో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయం-అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలి సీఎం కేసీఆర్ చెప్పారు. వాస్తవ దృక్పథంతో బడ్జెట్ తయారు చేసి, ప్రజా సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులుండేలా చూడాలని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనపై మంగళవారం కూడ కసరత్తు జరగనుంది. బడ్జెట్ కి తుది రూపం వచ్చాక, మంత్రివర్గంచే ఆమోదించి అసెంబ్లీని సమావేశపరచి, బడ్జెట్ ప్రతిపాదన తదితర ప్రక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=rqjR7jM90ZQ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + six =