తెలంగాణ ఎంసెట్-2020‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్

Eamcet Pharmacy Counseling Schedule Released, Mango News Telugu, Pharmacy, Telangana Eamcet, Telangana Eamcet Counseling, Telangana Eamcet Pharmacy, Telangana Eamcet Pharmacy Counseling Schedule, Telangana Eamcet Pharmacy Counseling Schedule Released, Telangana Pharmacy, Telangana Pharmacy Counseling

తెలంగాణ రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మ్‌ డీ సీట్ల భర్తీకి సంబంధించిన ఎంసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదలైంది.‌ నవంబర్ 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. రెండు విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ రూపొందించినట్టు పేర్కొన్నారు.

టీఎస్‌ ఎంసెట్-2020‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

తొలివిడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – నవంబర్ 19 నుంచి నవంబర్ 20 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – నవంబర్ 20 నుంచి నవంబర్ 21 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – నవంబర్ 20 నుంచి నవంబర్ 22 వరకు
  • ఆప్షన్స్ ఫ్రీజింగ్ సమయం – నవంబర్ 22
  • మొదటి విడత సీట్లు కేటాయింపు – నవంబర్ 24
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – నవంబర్ 24 నుంచి నవంబర్ 27 వరకు

చివరి విడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – డిసెంబర్ 1
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – డిసెంబర్ 2
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – డిసెంబర్ 2, 3
  • ఆప్షన్స్ ఫ్రీజింగ్ సమయం – డిసెంబర్ 3
  • చివరి విడత సీట్లు కేటాయింపు – డిసెంబర్ 5
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 వరకు
  • ప్రైవేట్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ వెబ్ సైట్ లో అందుబాటు : డిసెంబర్ 5

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 18 =