సీఎం కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా.. బాధ్యతలు స్వీకరించిన మాజీ సీఎస్ సోమేశ్‌ కుమార్‌

Telangana Former CS Somesh Kumar Takes Charge as Chief Advisor of CM KCR at New Secretariat Today,Telangana Former CS Somesh Kumar,CS Somesh Kumar Takes Charge as Chief Advisor,CS Somesh Kumar Takes Charge as Chief Advisor Of CM KCR,Chief Advisor of CM KCR at New Secretariat Today,Mango News,Mango News Telugu,CS Somesh Kumar Takes Charge at New Secretariat,Chief Advisor of CM KCR Is CS Somesh Kumar,Telangana Ex-CS Somesh Kumar comes back,Somesh Kumar assumes office as Advisor to Telangana,CS Somesh Kumar Latest News And Updates,Chief Adviser Latest News And Updates,Telangana Latest News And Updates

తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం నూతన సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమేశ్‌ కుమార్‌కు సచివాలయ అధికారులు పలువురు అభినందనలు తెలిపారు. కాగా సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం క్యాబినెట్ మంత్రి హోదాలో ఆయన తదుపరి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌.. డిసెంబర్ 31, 2019న సోమేశ్ కుమార్‌ను చీఫ్ సెక్రటరీ (సీఎస్) గా నియమించారు.

సోమేశ్ కుమార్‌ అంతకుముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కూడా సేవలందించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ)గా పనిచేసిన సమయంలో రాష్ట్ర పన్నుల వసూళ్లు, జీఎస్టీ వసూళ్లను పెంచేందుకు ఆయన చేసిన కృషిని చూసిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించడంతో పాటు వాటి రూపకల్పనలో సోమేశ్ కీలక పాత్ర పోషించారు. భూ రికార్డులను డిజిటలైజ్ చేయడంతో పాటు రెవెన్యూ శాఖ పనితీరును మెరుగుపరచడంలో ఆయన చేసిన కృషి రాష్ట్రానికి అమూల్యమైనదని సీఎం కేసీఆర్ అనేక బహిరంగ సభలలో మాజీ సీఎస్‌ను ప్రశంసించడం తెలిసిందే. ఇక 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన సోమేశ్ కుమార్‌ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం కలెక్టర్‌ సహా వివిధ హోదాల్లో పని చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =