నాటి తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి – గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

Telangana Governor Tamilisai Inaugurates Photo Exhibition of Freedom Fighters at Parade Grounds Secunderabad, Telangana Governor Opens Photo Exhibition, Gov Tamilisai Inaugurates Photo Exhibition, Governor Dr Tamilisai Soundararajan, Exhibition on Hyderabad Liberation Day, Mango News, Mango News Telugu, Hyderabad Liberation Day, Telangana Governor, Telangana Liberation Day, Telangana Liberation Day 2022, Telangana Formation Day, Telangna Day 2022, Tamilisai Soundararajan

తెలంగాణలో ‘సెప్టెంబర్ 17’ దినోత్సవం సందడి మొదలైంది. ఈసారి సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారంగా నిర్వహించనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. అలాగే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే రెండు ప్రభుత్వాలు రెండు వేర్వేరు పేర్లుతో దీనిని నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించాయి. ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరుతో కేంద్రం నిర్వహిస్తుండగా.. ‘జాతీయ సమైక్యతా దినోత్సవంగా’ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆమె పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. నాటి తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశానికీ స్వాతంత్య్రం లభించినా, నాటి నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్య్రం సాదించలేదని తెలిపారు. అత్యంత గడ్డు పరిస్థితుల్లో కొందరు తెలంగాణ పోరాట యోధులు నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేసారని గుర్తుచేశారు. ఈ క్రమంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని భారత్ ఆర్మీ సెప్టెంబర్ 17న హైదరాబాద్ లోకి అడుగుపెట్టి నిజాం ప్రభువుని గద్దె దించి, తెలంగాణకు స్వాతంత్య్రం ప్రసాదించారని వెల్లడించారు. ఈ చరిత్ర అంతా నేటి జెనరేషన్ యువతకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 11 =