ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్, డీజీపీ సమీక్ష

CS Somesh Kumar DGP Mahender Reddy held Review with Collectors SPs on Telangana Jathiya Samaikyatha Vajrotshavaalu, Cs Somesh Kumar Conference on Telangana Jathiya Samaikyatha Dinotsavaalu, Telangana Jathiya Samaikyatha Dinotsavaalu, Telangana Jathiya Samaikyatha Dinotsavaalu 2022, Telangana Integration Day 2022, Telangana Integration Day , Cs Somesh Kumar Held Video Conference With Collectors, Telangana CS Somesh Kumar, Telangana Integration Day Latest News And Updates, Telangana Jathiya Samaikyatha Dinotsavaalu, Telanagana Integration Day Celebrations,Mango News, Mango News Telugu,

ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నిజిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిలో భాగంగా 16న జరిగే ర్యాలీ, సభకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలెక్టర్లు విస్తృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈనెల 14వ తేదీనుండి 18వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని పేర్కొన్నారు.

ఈనెల 17న హైదరాబాద్‌ లో ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లా, మండల, గ్రామపంచాయతీ ప్రధాన కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. హైదరాబాద్ లో జరిగే ఆదివాసీ, బంజారా భవన్ ల ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున గిరిజనులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, అదేరోజు స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులకు సన్మానాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమాలన్నీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా జిల్లా అధికారుల సమన్వయంతో పనిచేయాలని, తదనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులను కోరారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అదనపు డీజీ ఎల్‌ అండ్‌ ఓ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హ్యాండ్లూమ్ టెక్స్ టైల్స్ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధా ప్రకాష్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఉన్నత విద్యా శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, టీఆర్‌ అండ్‌ బి కార్యదర్శి శ్రీనివాసరాజు, పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంత రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఓమర్ జలీల్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + thirteen =