భద్రాచలంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై

Telangana Governor Tamilisai Participated in The Grand Ceremony of Sri Rama Pattabhishekam at Bhadrachalam,Telangana Governor Tamilisai,Tamilisai Participated in The Grand Ceremony,Sri Rama Pattabhishekam at Bhadrachalam,Tamilisai Participated in Sri Rama Pattabhishekam,Governor Tamilisai Participated at Bhadrachalam,Mango News,Mango News Telugu,Governor to attend Sri Rama Pattabhishekam,Sri Rama Pattabhishekam Arrangements,Telangana Governor Tamilisai Latest News,Telangana Governor Tamilisai Latest Updates,Sri Rama Pattabhishekam Live Updates

భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మిథిలా స్టేడియంలో ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు భారీ సంఖ్యలో హాజరై తిలకించారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ మరియు మంత్రి సత్యవతి రాథోడ్‌లు పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి గవర్నర్‌ తమిళిసై పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం గవర్నర్‌ తమిళిసై గురువారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి రైలులో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసైకి ఆలయ ఈవోతో పాటు అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో గవర్నర్ సీతారామ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా గవర్నర్ తమిళిసై రైలులో భద్రాచలం వెళ్లడం ఇది రెండోసారి. గతేడాది భద్రాచలం వరదల సందర్భంగా ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన ఆమె అప్పుడు కూడా రైలులోనే వెళ్లారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here