కరోనా పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్షా సమావేశం, ఆందోళన వద్దని ప్రజలకు విజ్ఞప్తి

Delhi CM Arvind Kejriwal held Review on Covid-19 Situation Appealed People to Nothing to Worry,Delhi CM Arvind Kejriwal,Kejriwal held Review on Covid-19 Situation,Kejriwal Covid-19 Situation Appealed,Kejriwal For People to Nothing to Worry,Mango News,Mango News Telugu,Delhi Monitoring Covid-19 Situation,Delhi CM Kejriwal To Hold Review Meeting,Delhi govt closely watching COVID-19,Delhi CM Arvind Kejriwal on rising Covid cases,State wise Corona Cases in Last 24 Hours,Information about COVID-19,India Covid Last 24 Hours Report,Active Corona Cases,Corona Active Cases Exceeds,Corona News,Corona Updates,Coronavirus In India,COVID 19 India,COVID 19 Updates

దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కరోనా పరిస్థితులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న ఆరు రాష్ట్రాలను కేంద్రం ఇప్పటికే గుర్తించిందని, అందులో ఢిల్లీ ప్రస్తావన లేకపోయినప్పటికీ ఢిల్లీలో కరోనా పరిస్థితిని గమనిస్తూనే ఉన్నామని చెప్పారు.

కొత్త కరోనా వేరియంట్‌లు ను సకాలంలో గుర్తించడానికి ఢిల్లీలో నమోదైన అన్ని కరోనా పాజిటివ్ కేసుల శాంపిల్స్ కు జీనోమ్ సీక్వెన్సింగ్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎక్స్ బీబీ.1.16 ప్రధానమైన వేరియంట్ కాగా, దాదాపు 48 శాతం కేసులు ఈ వేరియంట్‌ను కలిగి ఉన్నాయని, మిగిలినవి సబ్ వేరియంట్‌ను కేసులుగా ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీలోని ఆసుపత్రులలో ఆక్సిజన్, వెంటిలేటర్ మరియు ఐసీయూ బెడ్స్ సహా 7,686 పడకలు సిద్ధంగా ఉన్నాయని, తగినంతగా ఆక్సిజన్ నిల్వ, అంబులెన్స్ ల సౌకర్యం అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించడానికి తగినంత సామర్థ్యం ఉందన్నారు. కరోనా నిబంధనలు, ప్రవర్తన విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రచారాన్ని నిర్వహించనుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా గురువారం ఢిల్లీలో 295 తాజా కోవిడ్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here