తెలంగాణలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1879 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 7, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 27,612 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 6,220 శాంపిల్స్ పరీక్షించగా 4,341 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1422, రంగారెడ్డిలో 176, మేడ్చల్ లో 94, కరీంనగర్ లో 32, నల్గొండలో 31, నిజామాబాద్ లో 19, వరంగల్ అర్బన్ లో 13, మెదక్ లో 12, ములుగులో 12, మహబూబ్ నగర్ లో 11 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 7, సాయంత్రం 5 గంటల వరకు) :
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 27,612
కొత్తగా నమోదైన కేసులు (జూలై 6- జూలై 7 (5PM-5PM) : 1879
నమోదైన మరణాలు : 7
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 16287
యాక్టీవ్ కేసులు : 11012
మొత్తం మరణాల సంఖ్య : 313
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu