తెలంగాణలో కొత్తగా 274 మందికి కరోనా పాజిటివ్, మరో 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

Coronavirus, COVID-19, covid-19 new variant, Covid-19 Updates in Telangana, Mango News, Mango News Telugu, New Covid 19 Variant, Omicron, Omicron covid variant, Omicron variant, Omicron Variant Cases in Telangana, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today district wise, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list, Telangana New Covid-19 Positive Cases, Update on Omicron

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 274 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 2, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,82,489 కి చేరింది. కరోనా వలన మరొకరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,030కి పెరిగింది. అలాగే మరో 227 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,74,680కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 212, రంగారెడ్డిలో 18, మేడ్చల్ మల్కాజిగిరిలో 17 నమోదయ్యాయి.

మరోవైపు తెలంగాణలో కొత్తగా 5 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 84కు చేరుకుంది. కాగా వీరిలో ఇప్పటికే 32 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో రిస్క్ కంట్రీస్ నుండి కాకుండా ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో ఐదుగురికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. ఇక ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన మరో 30 మంది శాంపిల్స్ ను ఇప్పటికే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జనవరి 2, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,97,59,257
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,82,489
  • కొత్తగా నమోదైన కేసులు : 274
  • కొత్తగా నమోదైన మరణాలు : 1
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,74,680
  • కరోనా రికవరీ రేటు: 98.85%
  • యాక్టీవ్ కేసులు: 3,779
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,030
  • కరోనా మరణాల రేటు: 0.59%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + fifteen =