బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష భగ్నం

Bandi Sanjay arrested, BJP Chief Bandi Sanjay, Cops arrest Bandi Sanjay Kumar, During Jagarana Deeksha at Party Office, Jagarana Deeksha, Jagarana Deeksha at Party Office, Mango News, Police remove BJP workers gathered at Bandi Sanjay Kumar, Telangana BJP chief arrested for attacking police, Telangana BJP Chief Bandi Sanjay, Telangana BJP Chief Bandi Sanjay Arrested During Protest, Telangana BJP Chief Bandi Sanjay Held by Police, Tension in Telangana’s Karimnagar as police arrest BJP MP

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్లో ఆదివారం రాత్రి చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పార్టీ కార్యాలయం లోపల తాళం వేసుకుని బండి సంజయ్ దీక్ష ప్రారంభించారు. అయితే, పోలీసులు కార్యాలయం తాళాలు పగలగొట్టి మరీ బండిని అరెస్టు చేసి మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీక్షకు సంబందించి ఇప్పటి వరకు 170 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కల్గించినందుకు బండి సంజయ్ ని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. అయితే, సంజయ్ పోలీస్ స్టేషన్లోనే జాగరణ దీక్షను కొనసాగిస్తున్నారు.

ఆరెస్టుకు ముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. 317 జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని విమర్శించారు. ఉద్యోగులు సొంత జిల్లాలో కూడా పరాయి వారుగా ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నల్గొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అనుమతించిన పోలీసులు తమకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

ఉద్యోగుల బదిలీల విషయంలో దీక్ష చేపట్టిన బండి సంజయను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించాడు. బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ జాగరణ చేస్తున్నారని వారిని పోలీసులు అరెస్ట్ చేయడం అమానుషమని ఈటల విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉద్యోగుల కోసం చేస్తున్న ఆందోళనను అడ్డుకుంటే ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =