సెప్టెంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Telangana State Assembly Session to Start From September 6th, Telangana Assembly session, Telangana State Assembly Session, TS Assembly session to commence on Sept 6, TS Legislative Assembly session, Telangana Assembly sessions from September 6th, business advisory council meet, Telangana Assembly Session 2022, 2022 TS Assembly Session, TS Assembly Session News, TS Assembly Session Latest News And Updates, TS Assembly Session Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 6, మంగళవారం ఉదయం 11.30 గంట‌ల‌కు శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి వి.న‌ర‌సింహాచార్యులు శుక్ర‌వారం నాడు వేర్వేరుగా ప్ర‌క‌ట‌నలు విడుద‌ల చేశారు. కాగా సమావేశాలకు సంబంధించిన ఎజెండా, సభ నిర్వహణ రోజులను సెప్టెంబర్ 6వ నిర్వహించే బీఏసీ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.

ఈ సమావేశాల్లో సంక్షేమ పథకాలు, ఇతర రాష్ట్ర సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక, ఇటీవల చోటుచేసుకున్న ఇతర పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కొంత వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =