రాష్ట్ర ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచిన ‘దుండిగల్‌’, అభినందనలు తెలిపిన డీజీపీ అంజనీ కుమార్

Dundigal Police Station from Cyberabad Commissionerate Awarded as Best PS-2022 by Union Home Ministry, Dundigal Police Station,Dundigal Cyberabad Commissionerate, Dundigal Best PS-2022, Best PS-2022 by Union Home Ministry, Mango News, Mango News Telugu, Dundigal Police Station Phone Number,Cyberabad Traffic Police Station List,Dundigal Police Station Address,Dundigal Police Station Circle Inspector Number,Dundigal Police Station Court,Dundigal Police Station Fir Status,Dundigal Police Station Inspector Name,Dundigal Police Station Pincode,Dundigal Police Station Si Number,Dundigal Police Station Si Phone Number,Dundigal Police Station Staff Name

తెలంగాణ రాష్ట్రంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ‘దుండిగల్‌’ పోలీస్‌స్టేషన్‌ ఉత్తమ స్టేషన్‌ గా నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాలలోని పోలీస్‌ స్టేషన్లకు వార్షిక ర్యాంకులు ప్రకటిస్తుండగా, 2022వ సంవత్సరానికి గానూ తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించి రంగారెడ్డి జిల్లాలోని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక అయినట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ దుండిగల్ కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్టిఫికెట్‌ ను జారీ చేసింది.

కేంద్ర హోం శాఖ జారీ చేసిన సర్టిఫికెట్‌ను సోమవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ సైబరాబాద్‌ పోలీసులకు అందజేసి అభినందనలు తెలిపారు. “కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన ఉత్తమ పోలీస్ స్టేషన్-2022 అవార్డు పొందినందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ కి హృదయపూర్వక అభినందనలు. అన్ని యూనిట్లు కొత్త టెక్నాలజీని పొందుపరచాలని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగైన అప్లికేషన్‌తో కేసులను పరిష్కరించడంలో తమ పనితీరును మెరుగుపరచుకోవాలి” అని డీజీపీ అంజనీ కుమార్‌ సూచించారు.

అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని అభినందించారు. “మేము వీధులను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, చట్టాన్ని అమలు చేసే అధికారుల ప్రయత్నాలను అభినందించడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. తెలంగాణలో ఉత్తమ పీఎస్ గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ కు సంబంధించి మేడ్చల్ డీసీపీ జి.సందీప్, దుండిగల్ పీఎస్ సీఐ పి.రమణా రెడ్డి మరియు అందరూ కానిస్టేబుళ్లకు అభినందనలు” అని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 3 =