బండి సంజయ్ విచారణకు 18న అనుమతి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటన

Telangana State Commission for Women Agreed to Bandi Sanjay's Request and Asked to Appear on March 18th at 11 AM,Telangana State Commission for Women,Bandi Sanjays Request,Bandi Sanjay Request to Appear on March 18th,Mango News,Mango News Telugu,TS Women Commission Ordered Inquiry,Bandi Offers to Appear Before Women's Commission,Bandi Sanjay Says he Cannot Appear,BRS Protests Against Bandis Comments,BRS Activists Protest,Derogatory Comments against MLC Kavitha,Delhi Liquor Policy Case,Telangana Political News And Updates,Telangana Womens Commission Latest Updates

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీన అనుమతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు మహిళా కమిషన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.

ఈ మేరకు మహిళా కమిషన్ బండి సంజయ్ ని మార్చి 15వ తేదీన కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించగా, తనకు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 15వ తేదీ కమిషన్ ఎదుట హాజరు కాలేనని, ఈ నెల 18వ తేదీన కమిషన్ చైర్ పర్సన్ సూచించిన సమయానికి హాజరు అవుతానని లేఖలో అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కమిషన్ అందుకు సానుకూలంగా స్పందించి, మార్చి 18వ తేదీన ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించింది. కాగా మార్చి 18న హాజరుకాలేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసు ద్వారా హెచ్చరించినట్టు మహిళా కమిషన్ ప్రకటనలో పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =