తెలంగాణలో జరిగే ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’లో సోనియా గాంధీ లేదా ప్రియాంక వాద్రా పాల్గొనే అవకాశం – రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy Announces Sonia Gandhi or Priyanka Vadra Likely To Attends Hath Se Hath Jodo Yatra in Telangana,CongressLeaders launched,Congress Haath Se Haath Jodo Abhiyan,Haath Se Haath Jodo Abhiyan,Haath Se Haath Jodo Abhiyan from January 26,Haath Se Haath Jodo Abhiyan logo released,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణలో జరిగే ఈనెల 26 నుంచి ప్రారంభమవనున్న ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’లో సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే నేతృత్వంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన భద్రాచలంలో లాంఛనంగా ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ను ప్రారంభిస్తామని, దాదాపు రెండు నెలల పాటు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎదో ఒకరోజు పార్టీ మాజీ అధ్యక్షురాలు, అగ్రనేత సోనియా గాంధీ కానీ, లేదా ఆమె కుమార్తె పార్టీలోని కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా కానీ పాల్గొనొచ్చని వెల్లడించారు.

ఇక తెలంగాణ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే నిర్వహిస్తున్న సమావేశాలకు ఆహ్వానం అందినా మూడుసార్లు హాజరుకాని వారినుంచి వివరణ తీసుకుంటామని, కీలక సమావేశానికి రానివారిని పార్టీనుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. త్వరలో నాగర్ కర్నూల్ లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఇక ఇదిలాఉండగా ఈ సమావేశంలో రేవంత్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పాదయాత్రతోనే పార్టీకి మనుగడ ఉంటుందని, నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ కూడా పాదయాత్రతోనే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపిన మాజీమంత్రి కొండా సురేఖ, పాదయాత్రతో ప్రజల్లోకి వేళ్తేనే కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. పీసీసీ కానీ, సీఎల్పీ కానీ లేదా ఇరువురు కలిసైనా.. పాదయాత్ర చేయాలని మాజీమంత్రి గీతారెడ్డి సహా పలువురు నేతలు కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here