ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కీలక బాధ్యతలు..!

Priyanka Gandhi and Karnataka Deputy CM DK Shivakumar Likely To Play Key Role For Congress in 2023 Telangana Polls,Priyanka Gandhi and Karnataka Deputy CM,DK Shivakumar Likely To Play Key Role,Congress in 2023 Telangana Polls,CM DK Shivakumar,Karnataka Congress leader DK Shivakumar,2023 Telangana polls,Mango News,Mango News Telugu,Priyanka Gandhi, DK Shivakumar, key responsibilities of Congress high command, Congress,Ponguleti Srinivas Reddy, Jupalli Krishna Rao,Priyanka Gandhi Latest News,Priyanka Gandhi Latest Updates

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులేస్తోంది. వ్యూహాత్మకంగా ఆలోచిస్తోంది. వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కర్ణాటకలో గెలుపు ఊపులో తెలంగాణనూ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అమలు చేయాల్సినవన్నీ ఆచరణలోకి తీసుకురావాలని చూస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణకు మరో ఇద్దరు నేతలను కేటాయించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాలు, గెలిచేందుకు చేపట్టాల్సిన ప్రచారం, ఇతర ముఖ్య విషయాల బాధ్యతలను వారిద్దరికీ అప్పగిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.

చాలా కాలం నుంచి తెలంగాణలో ఐసీసీసీ సెక్రటరీలు, ఇతర ముఖ్య నాయకులు స్థానిక నాయకులతో రెగ్యులర్‌గా సమావేశాలు ఏర్పాటు చేసి, పార్టీ గెలుపు కోసం పని చేస్తున్నారు. దీనికి అదనంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం హైకమాండ్ ప్రియాంక గాంధీ, డీకే శివ కుమార్‌ను కేటాయించింది. దీంతో వీరిద్దరూ కూడా అనేక కీలక విషయాల్లో పాలుపంచుకోనున్నారు. నాయకుల మధ్య విభేదాలు లేకుండా చూడటం, ఐకమత్యంగా పని సేలా చూసుకోవడం, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చడంలో వీరిద్దరూ కీలకంగా ఉండనున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం పార్టీ ముఖ్య నేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వచ్చి సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ.. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ వీరే తీసుకోనున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ లోకి ఇటీవల వలసలు పెరిగినా.. ఆశించిన స్థాయిలో ముఖ్య నాయకులు పార్టీలో చేరలేదు. కొంత కాలం కిందట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరారు. అయినప్పటికీ అనేక నియోజకవర్గాల్లో పార్టీకి ముఖ్య నాయకులు లేరు. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం లోపించింది. టిక్కెట్ల కేటాయింపు నిర్ణయం ఇంకా తీసుకోకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే.. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. అయినా కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీలో నుంచి బలమైన నాయకులను చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − five =