నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి బీజం పడిన క్షణం “దీక్షా దివ‌స్” – మంత్రి కేటీఆర్

Deeksha divas, Kalvakuntla Taraka Rama Rao, KTR, KTR Tweets On November 29-Deeksha Divas, Mango News, Minister KTR, Minister KTR Tweets On November 29, Minister KTR Tweets On November 29-Deeksha Divas, TRS Working President, TRS Working President Minister KTR, TRS Working President Minister KTR Tweets On November 29-Deeksha Divas

తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదికి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సాధన కోసం నవంబర్‌ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో గొప్ప మలుపుగా నిలిచిపోయింది. దీంతో ప్రతి సంవత్సరం నవంబర్‌ 29 వ తేదీని టీఆర్‌ఎస్‌ పార్టీ ‘దీక్షా దివ‌స్’గా నిర్వహిస్తుంది. సీఎం కేసీఆర్‌ చేపట్టిన దీక్షకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దీక్షా దివస్ సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

“తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి బీజం పడిన క్షణం..దీక్షా దివ‌స్” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీక్షా దివ‌స్ చరిత్రను మలుపు తిప్పిన రోజని, తెలంగాణ రాష్ట్రం కోసం మన ఉద్యమనేత చావో, రేవో అంటూ సమరశంఖం పూరించిన రోజు, తెలంగాణ రాష్ట్ర మార్గదర్శకంగా నిలిచిన రోజు అని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే దీక్షాదివస్ రోజున తనను అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారని గుర్తు చేశారు. అప్పటి నుండి సంఘటనలు అద్భుతమైన మలుపు తీసుకున్నాయని, ఆందోళన నుండి పరిపాలన వరకు చేరుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరియు సీఎం కేసీఆర్ కి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =