మే 8,9 21 తేదీల్లో ఏఈఈ రాత పరీక్షలు, షెడ్యూల్ ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

TSPSC Announces Examinations to be held for Posts of Assistant Executive Engineers on May 8 9 21st,TSPSC Announces Examinations,Examinations to be held for Assistant Executive Engineers,Assistant Executive Engineers Examinations on May 8 9 21st,Assistant Executive Engineers,TSPSC Examinations,Mango News,Mango News Telugu,TSPSC Examinations Latest News,TSPSC Examinations Latest Updates,Assistant Executive Engineers Latest News,TSPSC,Telangana News,Telangana Latest News And Updates,TSPSC Live News,TSPSC Examinations Live News

పేపర్ల లీకేజి వ్యవహారం నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షతో పాటుగా ఏఈఈ మరియు డిఏఓ పరీక్షలను కూడా రద్దు చేస్తునట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీ కోసం పరీక్షల షెడ్యూల్ ను టీఎస్‌పీఎస్సీ తాజాగా వెల్లడించింది. ఏఈఈ రాత పరీక్షల్లో భాగంగా మే 8వ తేదీన ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మే 9వ తేదీన అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మే 21వ తేదీన సివిల్‌ ఇంజినీరింగ్‌ రాత పరీక్షలను నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ముందుగా 2022, సెప్టెంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ నంబర్ 12/2022ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ క్రమంలో ఏఈఈ పరీక్షలను 2023, జనవరి 22న నిర్వహించారు. అయితే పేపర్ లీకేజీ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను మరియు కమిషన్ నిర్వహించిన అంతర్గత విచారణను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, నిర్వహించిన ఏఈఈ పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీంతో రద్దు చేయబడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల కోసం పరీక్షలను తిరిగి నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మే 8,9 21 తేదీల్లో ఏఈఈ రాత పరీక్షలు జరపనున్నట్టు తెలిపారు.

ఏఈఈ రాత ప‌రీక్ష‌ల తేదీలు ఇవే:

  • ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ – మే 8న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహణ – కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష.
  • అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ – మే 9న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహణ – కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష.
  • మెకానికల్‌ ఇంజినీరింగ్‌ – మే 9న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహణ – కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష.
  • సివిల్‌ ఇంజినీరింగ్‌ – మే 21న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహణ – ఓఎంఆర్‌ బేస్డ్ పరీక్ష.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − nineteen =