టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష అక్టోబర్ 4 న నిర్వహణ

CET 2020 Entrance Exam, TSRJC, TSRJC CET, TSRJC CET 2020 Entrance Exam, TSRJC CET 2020 Exam, TSRJC CET exam date, TSRJC Exam, TSRJC Exam 2020, TSRJC exam date, TSRJC notification 2020-2021, TSRJC-CET-2020

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశానికి గానూ నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2020 ప్రవేశ పరీక్ష అక్టోబర్ 4 న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పరీక్ష అక్టోబర్ 4 న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి 10 జిల్లా కేంద్రాల్లోనూ మరియు సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోని పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష కోసం మొత్తం 42,037 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ వెల్లడించారు. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు సెప్టెంబర్ 24 వ తేదీ నుండి http://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here