ఏపీ పీజీసెట్-2022 నోటిఫికేషన్ విడుదల

APPGCET AP Post Graduate Common Entrance Test-2022 Notification Released, APPGCET-2022 Notification Released, AP Post Graduate Common Entrance Test-2022 Notification Released, Notification Released, AP Post Graduate Common Entrance Test, 2022 APPGCET Notification Released, APPGCET Notification Released, APPGCET Notification, APPGCET-2022 Notification, APPGCET-2022, 2022 APPGCET, APPGCET, state level Post Graduate Common Entrance Tests, APPGCET-2022 Notification News, APPGCET-2022 Notification Latest News, APPGCET-2022 Notification Latest Updates, APPGCET-2022 Notification Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ పీజీసెట్-2022 నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఏపీ పీజీసెట్-2022 నిర్వహణ బాధ్యతలను ఏపీ ఉన్నత విద్యా మండలి మరోసారి కడప యోగి వేమన యూనివర్సిటీకి అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే, వాటి అనుబంధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ (ఎయిడెడ్/అన్‌ఎయిడెడ్) కాలేజీలు, మైనారిటీ కాలేజీలలో పీజీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం (ఎంఏ, ఎం.కామ్, ఎంఎస్సీ, ఎమ్సీజే, ఎంజేఎంసీ, ఎం.పీ.ఈడీ, ఎంఈడీ, ఎంఎస్సీ.టెక్…మొదలైనవి) ఏపీ పీజీసెట్-2022ను నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలకు అర్హత డిగ్రీలో ఉత్తీర్ణులైన లేదా చివరి సెమిస్టర్ (సంవత్సరం) పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

జూన్ 22, బుధవారం నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయిందని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకి ఆలస్య రుసుము లేకుండా జూలై 20ను చివరి తేదీగా పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూలై 25 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సమర్పించిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే జూలై 25 నుంచి జూలై 29 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అలాగే ఆగస్టు 17 నుంచి 22 వరకు పీజీ సెట్ పరీక్షలు జరిగే అవకాశముందని తెలిపారు. ఖచ్చితమైన తేదీలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను https://cets.apsche.ap.gov.in/APPGCET2022/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here