టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2023 పరీక్ష దరఖాస్తు గడువు ఏప్రిల్ 15 వరకు పెంపు

TSRJC CET 2023 Online Application Date Extended upto April 15th,TSRJC CET 2023 Online Application,TSRJC CET 2023 Online Application Date Extended,TSRJC CET 2023 Extended upto April 15th,TSRJC CET 2023,TSRJC CET 2023 Notification,TSRJC apply online 2023,Mango News,Mango News Telugu,TSRJC CET 2023 Latest News,TSRJC CET Latest Updates,TSRJC CET 2023 Live Updates,Telangana Latest News And Updates,Hyderabad News,Telangana News,Telangana News Today,TSRJC CET Application Form 2023 Released

తెలంగాణ రాష్ట్రంలో 35 గురుకుల‌ (రెసిడెన్షియల్) జూనియర్‌ కళాశాలల్లో 2023-24 సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే “టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2023” పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 15వ తేదీ వరకు పొడిగించారు. టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు 2023 ఏప్రిల్ నెలలో పదో తరగతికి హాజరవుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో (https://tsrjdc.cgg.gov.in/) దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని ముందుగా మార్చి 31గా నిర్ణయించారు. అయితే తల్లితండ్రుల నుంచి విజ్ఞప్తులు, విద్యార్థుల సౌకర్యార్ధం తాజాగా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని ఏప్రిల్ 15కు పొడిగించినట్టుగా తెలిపారు. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, 2022-23 పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 20 కలిపి మొత్తం 35 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉండగా, 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ/బైపీసీ/ఎంఈసీ-ఇంగ్లీషు మీడియం) ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ సెట్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2023 పరీక్షను మే 6వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ప్రవేశపరీక్ష మల్టీపుల్​ చాయిస్​ విధానంలో మొత్తం 150 మార్కులకు ఉండనుండగా, దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు http://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here