హైదరాబాద్‌లో పలు జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Union Minister Nitin Gadkari Inaugurates National Highways Development Works in Hyderabad, Union Minister Nitin Gadkari To Launch Two National Highways Today, Nitin Gadkari To Launch Two National Highways Today, Union Road Transport and highways Minister Nitin Gadkari will be dedicating two NHAI projects in Telangana, two NHAI projects in Telangana, Union Road Transport and highways Minister Nitin Gadkari, Union Road Transport Minister Nitin Gadkari, highways Minister Nitin Gadkari, Union Minister Nitin Gadkari, Minister Nitin Gadkari, Nitin Gadkari, Telangana Two National Highways, Two National Highways, Two National Highways News, Two National Highways Latest News, Two National Highways Latest Updates, Two National Highways Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలంగాణలో దాదాపు 8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈరోజు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న గడ్కరీ.. శంషాబాద్‌ సమీపంలో హైవేల విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయగా.. మరో రెండు ప్రధాన జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.7,853 కోట్ల వ్యయంతో 354 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని, దీని ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో దాదాపు అన్ని జిల్లాలు జాతీయ రహదారులతో కనెక్టివిటీని కలిగి ఉన్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో రోడ్డు రవాణా ముఖ్యమన్నారు గడ్కరీ. ఈ జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల రవాణాతో పాటు నగరంలో ట్రాఫిక్‌ను మెరుగుపరచడం వల్ల ప్రమాదాల సంఖ్య, పర్యావరణ కాలుష్యం తగ్గుముఖం పడుతుందని గడ్కరీ తెలిపారు. నగరం చుట్టుపక్కల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.

నవ భారత్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, దీనికి నిదర్శనమే ‘భారతమాల పరియోజన’ కార్యక్రమం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమం అద్భుతంగాసాగుతోందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ చొరవతోనే తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి త్వరితగతిన జరుగుతోందని కేంద్ర రహదారుల సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. కాగా కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో స్థానిక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ వద్ద గల జీఎంఆర్ గార్డెన్స్ లో బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాయంత్రం జరుగనున్న సభలో నితిన్ గడ్కరీ ప్రసంగించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =