కుప్పంలో అక్రమ మైనింగ్​ పై ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయండి, ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ

TDP Chief Chandrababu Writes a Letter to AP CS Over Illicit Mining Issue at Kuppam, Chandrababu Writes a Letter to AP CS Over Illicit Mining Issue at Kuppam, TDP Chief Chandrababu Writes a Letter to AP CS, TDP Chief Chandrababu Writes a Letter to Andhra Pradesh Chief Secretary, Andhra Pradesh Chief Secretary, AP CS, TDP Chief Chandrababu, TDP Chief Nara Chandrababu Naidu, Nara Chandrababu Naidu, TDP Party Chief, Illicit Mining Issue, Illicit Mining Issue at Kuppam, Kuppam Illicit Mining Issue, Kuppam Illicit Mining Issue News, Kuppam Illicit Mining Issue Latest News, Kuppam Illicit Mining Issue Latest Updates, Kuppam Illicit Mining Issue Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని లేఖలో సీఎస్ ను కోరారు. లేఖతో పాటుగా ముద్దనపల్లిలో సర్వే నెంబర్ 104, 213 లలో అక్రమ మైనింగ్ పై ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను జత చేశారు.

ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్ ను ఎన్జీటీ నిర్థారించిందని, అందుకు పాల్పడిన వారి పేర్లు, వివరాలు తెలపాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎస్ తో పాటుగా సంబంధిత అధికారులు వెంటనే ఈ మైనింగ్ అంశాన్ని పరిశీలించి శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ అదేశాలను అమలు చేయాలని కోరారు. అన్ని విధాలా పకడ్బందీ చర్యలతో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =