అక్టోబర్ 20న సెర్బియాలో జరగనున్న ‘బయోటెక్ ఫ్యూచర్ ఫోరమ్ సమ్మిట్‌’కు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం

World Economic Forum Invites Minister KTR To Participates Biotech Future Forum Summit in Serbia on Oct 20, World Economic Forum Invites Minister KTR, KTR To Participate Biotech Future Forum, Biotech Future Forum Summit in Serbia, World Economic Forum, World Economic Forum 2022, Mango News, Mango News Telugu, Biotech Future Forum Summit in Serbia, Biotech Future Forum Summit, Biotech Future Forum Summit Oct20, Minister KTR, Telangna Minister KTR, KTR Latest News And Updates, TRS Party, Telangna IT Minister KTR

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి అరుదైన ఆహ్వానం అందుకున్నారు. సెర్బియా దేశంలోని బెల్‌గ్రేడ్‌లో అక్టోబర్ 20న నిర్వహించనున్న ‘బయోటెక్ ఫ్యూచర్ ఫోరమ్ సమ్మిట్‌’కు హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఈ మేరకు సెర్బియా ప్రభుత్వంతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంయుక్త్మగా మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానిస్తూ లేఖను పంపాయి. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ హెల్త్ కేర్, లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా మారిందని లేఖలో వారు ప్రశంసించారు. దీనికోసం రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు, అనుభవాలను సదస్సులో వివరించాల్సిందిగా మంత్రిని కోరారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం దీనిని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

వారు పంపిన ఆహ్వాన పత్రంలో.. ‘రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా ప్రభుత్వం మరియు 20 అక్టోబర్ 2022న సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరగనున్న ‘బయోటెక్ ఫ్యూచర్ ఫోరమ్’లో పాల్గొనవలసిందిగా మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. బయోటెక్నాలజీ అభివృద్ధి మరియు అది సృష్టించే అవకాశాలపై ఫోరమ్ చర్చిస్తుంది’ అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో ఆయన దీనికి స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. దీనిలో.. ‘గౌరవనీయులైన సెర్బియా ప్రధానమంత్రి అనా బ్రనాబిక్ మరియు అధ్యక్షుడు బోర్గెబ్రెండేలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ఆహ్వానం తెలంగాణ లైఫ్-సైన్సెస్ ఎకోసిస్టమ్ మరియు ముఖ్యంగా బయోటెక్నాలజీ రంగం యొక్క బలానికి గుర్తింపుగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here