తెలంగాణలో కొత్త రెవెన్యూ చ‌ట్టంపై గెజిట్ నోటిఫికేష‌న్ జారీ

New Revenue Act, New Revenue Act 2020, New Revenue Act Gazette Notification, Telangana Govt Gazette Notification on New Revenue Act, Telangana Govt Issued Gazette Notification on New Revenue Act, Telangana issues gazette notification on Land Act, telangana land registration, telangana land revenue act, Telangana New Revenue Act 2020

ఇటీవల వర్షాకాల సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ విధానానికి సంబంధించి భూమిపై హక్కులు, పాస్‌పుస్తకాల బిల్లు-2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు బిల్లు-2020 లను శాసన సభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయ సభల ఆమోదం అనంతరం ఈ బిల్లులకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర‌రాజన్‌ ఆమోదముద్ర వేయడంతో అవి చట్టాలుగా మారాయి. దీంతో ఈ చట్టాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ను జారీ చేసింది.

నూతన రెవెన్యూ బిల్లులు, టిఎస్ బీపాస్, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, ప్రైవేటు యూనివ‌ర్సిటీలు, తెలం‌గాణ ఉద్యో‌గుల పదవీ విర‌మణ వయసు క్రమ‌బ‌ద్ధీ‌క‌రణ సహా మొత్తం 12 బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఆయా చట్టాలకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికెషన్స్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిబంధనలకు అనుగుణంగా ఈ చట్టాలన్నీ అమ‌ల్లోకి రానున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 3 =