రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం

MLAs, Speaker's Notices to Rebel MLAs.. Order to Attend the Hearing, AP Politics, Speaker Tammineni sitaram, TDP, YCP, Janasena, YCP, Rajya Sabha, TDP MLAs, Congress MLAs, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, Mango News Telugu, Mango News
AP Politics, Speaker Tammineni sitaram, TDP, YCP, Janasena

ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం కాక రేపుతోంది. ఇప్పటికే అధికార వైసీపీ, తెలుగు దేశం పార్టీలు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశాయి. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాయి. అయితే ఆ పిర్యాదులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి.

ఏపీ నుంచి మూడు రాజ్యసభ ఎంపీ సీట్లు మార్చిలో ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీలుగావున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్‌ల పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీకే ఎక్కువ బలం ఉంది. దీంతో ఆ మూడు ఎంపీ సీట్లను వైసీపీ పార్టీకే దక్కే అవకాశం ఉంది.  తద్వారా రాజ్యసభలో టీడీపీకి చోటు లేకుండా అవుతుంది.

ఈక్రమంలో వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపిక కాకుండా తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీలోవున్న అసంతృప్తి ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలో చేరారు. అదే సమయంలో టీడీపీ నుంచి కూడా నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. ఈక్రమంలో తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అటు తెలుగు దేశం పార్టీ కూడా తమపార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.

ఈక్రమంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు జనసేన నుంచి వైసీపీలో చేరిన ఒక ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న స్వయంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలని సూచించారు. మరి స్పీకర్ నోటీసులపై రెబల్ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారు? విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eight =