ఆప్కాస్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌, 50,449 మందికి నియామక పత్రాలు

Andhra Pradesh Outsourcing Services Corporation, AP CM YS Jagan, AP Outsourcing Corporation Registration 2020, AP Outsourcing Jobs Registration, AP Outsourcing Recruitment 2020, AP Outsourcing Services Corporation, apcos, APCOS 2020, YS Jagan Launches AP Outsourcing Services Corporation

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 3, శుక్రవారం నాడు ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌) ను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అండగా ఉండే ప్రత్యేక కార్పోరేషన్ ఆప్కాస్‌ను సీఎం వైఎస్ జగన్‌ ప్రారంభించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా, ఇకపై అన్ని నియామకాలను పారదర్శకత పద్దతిలో చేపట్టేందుకు ఈ ఆప్కాస్ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు పొందిన పలువురితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం మాట్లాడారు.

ఆప్కాస్ ద్వారా ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వచ్చే రోజుల్లో మిగతా ఖాళీలను కూడా అప్కోస్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మొత్తం ఉద్యోగాల్లో మహిళలకూ 50 శాతం దక్కేలా చూస్తామన్నారు. ఈఎస్ఐ,ఈపీఎఫ్ విధానాలు సక్రమంగా అమలుతాయని చెప్పారు. లంచాలు, కమిషన్లు, దళారులు, కుల, మత, వివక్ష లేకుండా ఉద్యోగాలు కల్పించేందుకే ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆప్కాస్ ద్వారా ప్రతి నెల 1 వ తేదీనే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు చెల్లించనున్నటు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =