నిరుద్యోగుల సమస్యలపై “ఉద్యోగదీక్ష” తలపెట్టిన వైఎస్ షర్మిల

Hunger Strike Of YS Sharmila, Hunger Strike Of YS Sharmila In Telangana, Indira Park, Mango News, telangana, YS Sharmila, YS Sharmila Hunger Strike, YS Sharmila Hunger Strike In Telanganan, YS Sharmila Hunger Strike News, YS Sharmila Hunger Strike Updates, YS Sharmila New Party, YS Sharmila New Party In Telangana, YS Sharmila New Party Name In Telangana, YS Sharmila New Political Party Announcement, YS Sharmila will be Held Udyoga Deeksha, YS Sharmila will be Held Udyoga Deeksha Tomorrow at Dharna Chowk

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేపట్టడానికి వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలనీ కోరుతూ “ఉద్యోగదీక్ష” పేరుతో గురువారం నాడు నగరంలోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు. వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే ముందుగా ఏప్రిల్ 15 ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 18 ఉదయం 11 గంటల వరకు మూడు రోజులు అనుమతి ఇవ్వాలని కోరగా, పోలీసులు ఒక్కరోజు దీక్షకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో నేడు వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు.

మరోవైపు ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి రోజు అయిన జులై 8వ తేదీన కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపారు. ఈ సభ సందర్భంగానే నిరుద్యోగ యువత తరఫున నిరాహార దీక్ష చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో నిరుద్యోగులు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, ఇతర పార్టీల నుంచి నేతలు సైతం మద్దతు పలికే అవకాశం ఉందని వైఎస్ షర్మిల కార్యాలయం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =