ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన.. ఇండియాకు రానున్న ఐరన్ డోమ్ టెక్నాలజీ?

PM Modi Embarks 2-Day Visit of Israel to Address Historic Knesset and For Defence, Trade Talks

భారత ప్రధాని మోదీ రెండు రోజుల చారిత్రాత్మక పర్యటన నిమిత్తం బుధవారం (ఫిబ్రవరి 25, 2026) నాడు ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సాగుతోంది.

కాగా, 2017లో మొదటిసారి ఇజ్రాయెల్‌ను సందర్శించిన తర్వాత, మోదీ అక్కడ పర్యటించడం ఇది రెండోసారి. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో భేటీ అవ్వడంతో పాటు, హోలోకాస్ట్ బాధితుల జ్ఞాపకార్థం నిర్మించిన ‘యాద్ వాషెమ్’ మ్యూజియాన్ని సందర్శిస్తారు.

ఇంకా ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన ‘నెస్సెట్’ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తద్వారా ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు.

రక్షణ, అంతరిక్షం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు మరియు వ్యవసాయ రంగాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. ముఖ్యంగా భారత రక్షణ కవచం ‘సుదర్శన్ చక్ర’ను బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ యొక్క ‘ఐరన్ డోమ్’ సాంకేతికతపై చర్చలు జరగనున్నాయి.

మోదీ ఇజ్రాయెల్ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా, ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రాముఖ్యతను చాటిచెప్పేలా ఉంది. రక్షణ మరియు సాంకేతిక రంగాల్లో ఇజ్రాయెల్ సహకారం భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here