మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, లాక్‌డౌన్‌ ఆంక్షలు జూన్ 1 వరకు పొడిగింపు

Maharashtra Govt Extended Lockdown Restrictions in the State till June 1st,Mango News,Mango News Telugu,Maharashtra,Corona Positive Cases in Maharashtra,Maharashtra Corona,Maharashtra Covid Cases,Maharashtra Corona Cases,Maharashtra Coronavirus,Maharashtra Coronavirus Updates,Maharashtra COVID 19,Maharashtra Covid-19 Latest Updates,Maharashtra Coronavirus News,Lockdown In Maharashtra,Maharashtra Lockdown News Live,Maharashtra Government Extends Lockdown,Maharashtra Covid Restrictions Extended,Maharashtra Extends Emergency Covid Restrictions,Maharashtra Extends Covid-19 Lockdown Till June 1,Maharashtra Covid Restrictions,Maharashtra Extends Lockdown Till 1St June,Maharashtra Extends Lockdown Restrictions

రాష్ట్రంలో రోజువారీగా వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ‘బ్రేక్‌ ద చైన్‌’ పేరుతో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను మహారాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆంక్షలు గడువు పొడిగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రేక్‌ ద చైన్‌ కింద కఠినమైన ఆంక్షలు జూన్ 1 ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటాయని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.

మరోవైపు ఏ రవాణా విధానం ద్వారా అయిన రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులు ఆర్టీ-పిసిఆర్ నెగటివ్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. మహారాష్ట్రలో ప్రవేశానికి గరిష్టంగా 48 గంటల ముందుగా ఈ రిపోర్ట్ జారీ చేయబడి ఉండాలని చెప్పారు. అలాగే కార్గో సర్వీసుల్లో డ్రైవర్, క్లీనర్ కు మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. కార్గో సర్వీస్ కింద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు 48 గంటల ముందు తీసుకున్న ఆర్టీ-పిసిఆర్ నెగటివ్ రిపోర్ట్ చూపిస్తేనే అనుమతి ఉంటుందని, అది కూడా 7 రోజుల వరకే చెల్లుతుందని తెలిపారు. ఇక మహారాష్ట్ర రాష్ట్రంలో ఇప్పటివరకు 52,26,710 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 46,00,196 మంది కరోనా నుంచి కోలుకోగా, 78,007 మంది మరణించారు. ప్రస్తుతం 5,46,129 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + ten =