ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. 98వ ఎడిషన్‌కు చెందిన ఈ కార్యక్రమం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న డాల్బీ థియేటర్‌లో నిర్వహించగా.. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.30 గంటలకు అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ అమెరికన్ కమేడియన్, రచయిత, టెలివిజన్ హోస్ట్ కానన్ ఓబ్రియాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం గమనార్హం. కాగా, ఆస్కార్ వేడుకకు కానన్ ఓబ్రియాన్ వరుసగా రెండోసారి హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం.
ఇక ఈ వేడుకలో ప్రముఖ ఇండియన్-హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై సందడి చేసి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా, ఈ ఏడాది కొన్ని విభాగాల్లో అవార్డులను ప్రకటించే ప్రెజెంటర్లలో కూడా ఆమె ఒకరిగా ఉండటం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల రేసులో ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన “సిన్నర్స్” చిత్రం అత్యధికంగా 16 నామినేషన్లు సాధించి ముందంజలో నిలిచింది. మరోవైపు పాల్ థామస్ అండర్సన్ తెరకెక్కించిన “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్” చిత్రం 13 నామినేషన్లతో దానికి గట్టి పోటీ ఇచ్చింది.
ఆస్కార్ అవార్డ్స్ 2026: ప్రధాన విజేతల జాబితా
- ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
- ఉత్తమ నటుడు: మైఖేల్ బి జోర్డన్ (సిన్సర్స్)
- ఉత్తమ నటి: జెస్సీ బుక్లే (హమ్నెట్)
- ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్(వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
- ఉత్తమ సహాయ నటుడు: ఈన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
- ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్(వెపన్స్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా(సిన్నర్స్)
- ఉత్తమ ఎడిటింగ్: యాండీ జుర్గెన్ సన్(వన్ బ్యాటిల్ అఫ్టర్ అనదర్ )
- ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్(సిన్నర్స్)
- ఉత్తమ సౌండ్ : ఎఫ్ 1
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్
- ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్
- ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : గోల్డెన్ ఫ్రమ్ కేపాప్ డీమాన్ హంటర్స్
- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: పాల్ థామస్ అండర్సన్(వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
- ఉత్తమ క్యాస్టింగ్ : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకిన్ స్టన్
- ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్: ఫ్రాంకిన్ స్టన్
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరల్, షేన్ వ్యూ(ఫ్రాంకిన్ స్టన్)
- ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ(నార్వే)
- ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కెపాస్ డెమన్ హంట్స్
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్జేంచ్ సలైవా
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్ నోబడీ ఎగనెస్ట్ పుతిన్
- ఉత్తమ డాక్యుమెంటరీ ఆర్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్
కీలక అంశాలు:
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్: ఈ చిత్రం మొత్తం 6 ఆస్కార్ అవార్డులను గెలుచుకుని ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది.
మైఖేల్ బీ జోర్డాన్: ‘సిన్నర్స్’ చిత్రంలో తన నటనకు గాను ఆయన తొలి ఆస్కార్‌ను అందుకున్నారు.



































