మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు

SC Verdict on Reservations Caste Based Benefits Can't Carry Over Automatically After Conversion

రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు అక్టోబర్ 15న కీలక తీర్పు వెలువరించింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తులు కేవలం మత మార్పిడి ఆధారంగా బీసీ ముస్లిం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందలేరని స్పష్టం చేసింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

తమిళనాడు ప్రభుత్వం 2024 మార్చిలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, బీసీ, ఎంబీసీ, డీనోటిఫైడ్ కమ్యూనిటీలు, ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఇస్లాంలోకి మారితే నిర్దిష్ట బీసీ ముస్లిం వర్గాల కింద గుర్తింపు పొంది రిజర్వేషన్ ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించింది. అయితే ఈ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని మద్రాస్ హైకోర్టు 2026 జూన్ 25న రద్దు చేసింది.

2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్, తనకు ముస్లిం లబ్బాయిస్ వర్గానికి చెందిన వ్యక్తిగా కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరారు. అధికారుల తిరస్కరణతో ఈ వివాదం న్యాయస్థానానికి చేరింది. మత మార్పిడి ఒక్కటే నిర్దిష్ట బీసీ ముస్లిం సామాజిక వర్గంలో సభ్యత్వాన్ని నిరూపించదని న్యాయస్థానాలు పేర్కొన్నాయి.

ఈ తీర్పు ప్రకారం, మతం మారినంత మాత్రాన గత సామాజిక వర్గ గుర్తింపు ఆధారంగా మరో వర్గానికి చెందిన రిజర్వేషన్ హోదా ఆటోమేటిక్‌గా లభించదు. సంబంధిత సామాజిక వర్గానికి వర్తించే చట్టపరమైన అర్హతలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here