గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. 48 కిలోల విభాగంలో మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మీరాబాయి చాను పసిడి పతకం సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి వరుసగా మూడోసారి గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. స్నాచ్ విభాగంలో 85 కేజీలు ఎత్తి గేమ్స్ రికార్డు నెలకొల్పిన చాను.. క్లీన్ అండ్ జర్క్‌లో 105 కేజీలు విజయవంతంగా లిఫ్ట్ చేసింది. మొత్తంగా 190 కేజీలు ఎత్తి మరో గేమ్స్ రికార్డును సృష్టిస్తూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
A golden hat-trick for India! 🥇🥇🥇🇮🇳@mirabai_chanu clinches the #Gold medal at the Glasgow Commonwealth Games, adding another golden chapter to India's sporting journey. @YASMinistry #Cheer4Bharat #CommonwealthGames #MirabaiChanu #Glasgow2026 pic.twitter.com/gopyNGAPhQ
— DD News (@DDNewslive) July 26, 2026
ఈ పోటీల్లో నైజీరియాకు చెందిన రూత్ అసుక్వో న్యోంగ్ 168 కేజీలు ఎత్తి రజత పతకం, మలేసియాకు చెందిన ఐరీన్ జేన్ హెన్రీ 167 కేజీలతో కాంస్య పతకం సాధించారు. కాగా, భారత్‌కు వెయిట్ లిఫ్టింగ్‌లో ఇది రెండో పతకం కావడం విశేషం. అంతకుముందు పురుషుల 60 కేజీల విభాగంలో రిషికంఠ సింగ్ రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు
చరిత్ర సృష్టించిన మీరాబాయి చానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. “భారత వెయిట్‌లిఫ్టింగ్ చరిత్రలో మరొక స్వర్ణ అధ్యాయం లిఖించబడింది” అని ఆయన కొనియాడారు. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా స్వర్ణ పతకాలు సాధించడమే కాకుండా, తన కెరీర్లో మొత్తంగా 4వ కామన్వెల్త్ మెడల్ సాధించిన మీరాబాయి ప్రదర్శన ప్రతి భారతీయుడికి ఎంతో స్ఫూర్తిదాయకమని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
Another glorious chapter in Indian Weightlifting!
The talented Mirabai Chanu once again showcased her skills at the Commonwealth Games with a stunning performance in the 48 kg category and winning Gold. With back-to-back Commonwealth Games Golds and an overall fourth CWG medal… pic.twitter.com/37IOvMXBTI
— Narendra Modi (@narendramodi) July 26, 2026







































