సైబర్ దాడుల భయం.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన కోట్లాది వెబ్‌సైట్లు

Global Web Disruption Nations Take Portals Offline Amid Severe Software Vulnerabilities

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ భద్రతను కుదిపేసే కీలక పరిణామం చోటుచేసుకుంది. వెబ్‌సైట్ల రూపకల్పనలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే ‘పీహెచ్‌పీ’ (PHP) ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రెండు అత్యంత తీవ్రమైన భద్రతా లోపాలు బయటపడటంతో ఇంటర్నెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు సర్వర్లపై రిమోట్‌గా దాడి చేసి మాల్‌వేర్‌ను చొప్పించే ప్రమాదం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు.

దీంతో అప్రమత్తమైన యూరప్, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ తదితర దేశాల ప్రభుత్వాలు హ్యాకింగ్ ముప్పును నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా తమ అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లను తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రపంచంలోని దాదాపు 70 శాతానికి పైగా వెబ్‌సైట్లు పీహెచ్‌పీ ఆధారంగానే నడుస్తుండటం గమనార్హం. పీహెచ్‌పీ 5 వెర్షన్ నుంచి తర్వాతి అన్ని వెర్షన్లలోనూ ఈ లోపాలు ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నెదర్లాండ్స్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్‌తో పాటు ఫ్రాన్స్ ఇంటీరియర్ మినిస్ట్రీ, ఫిన్లాండ్ స్టేట్ ఐటీ సర్వీసెస్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఆన్‌లైన్ సేవలను నిలిపివేసి భద్రతా ప్యాచ్‌లు అప్‌డేట్ చేసే పనిలో పడ్డాయి. ఈ సాంకేతిక లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వెబ్‌సైట్లు, పబ్లిక్ పోర్టల్స్ భద్రతా ప్రమాదంలో పడే అవకాశం ఉందని, సైబర్ ఏజెన్సీల సూచనల మేరకు తక్షణమే సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here