రెండోదశ అసెంబ్లీ ఎన్నికలు: బెంగాల్ లో 80.43, అస్సాంలో 74.79 శాతం పోలింగ్

Assam Assembly Elections, Assam Assembly Elections 2021, Mango News, Second Phase Polling Underway, West Bengal and Assam Assembly elections, West Bengal Assembly Elections, West Bengal Elections, West Bengal Elections 2021, West Bengal Elections latest news, West Bengal Elections live news, West Bengal Elections live updates, West Bengal Elections News, West Bengal Elections Second Phase, West Bengal Elections Second Phase Begins, West Bengal elections updates

పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు వరకు పశ్చిమబెంగాల్ లో 80.43 శాతం, అస్సాంలో 74.79 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ రెండోదశలో భాగంగా పశ్చిమబెంగాల్‌ లో సీఎం మమతా బెనర్జీ పోటీచేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున సువెందు అధికారి పోటీ చేశారు. ఈ క్రమంలో నందిగ్రామ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. మొత్తం బెంగాల్ ఎన్నికలలోనే కీలకంగా మారిన నందిగ్రామ్ లో పెద్దఎత్తున కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరించి పర్యవేక్షణ చేశారు. మరోవైపు రెండో దశ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

–> పశ్చిమబెంగాల్ లో రెండో దశలో 30 అసెంబ్లీ స్థానాల్లో గురువారం నాడు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 30 స్థానాలకు గానూ అన్ని పార్టీల నుంచి 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈదశలో 75 లక్షలకు పైగా ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరారు. ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు థర్మల్‌ స్కానింగ్ చేస్తూ, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఈవీఎంలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. బెంగాల్లో ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్యే కీలక పోటీనెలకుంది. కాంగ్రెస్, వామపక్షాల కూటమి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక బెంగాల్లో మూడో విడత పోలింగ్ ఏప్రిల్ 6న జరగనుంది.

–> ఇక అస్సాం రాష్ట్రంలో గురువారం నాడు రెండో దశలో భాగంగా 39 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది‌. రెండోదశలో 345 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 73.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అస్సాంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాజోత్‌ కూటమి (కాంగ్రెస్, ఏఐయూడిఎఫ్, సీపీఐ ఎంఎల్-ఎల్, ఆర్జేడీ, సీపీఎం(ఎం), సీపీఐ, బిపిఎఫ్, ఆన్చాలిక్ ఘనమోర్చా) మరియు బీజేపీ-ఏజీపీ కూటమి మధ్యే ప్రధాన పోటీ నెలకుంది. మరోవైపు ఏజేపీ-రైజొర్‌దళ్‌ కూటమి కూడా గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక అస్సాంలో మూడో విడత పోలింగ్ ఏప్రిల్ 6న జరగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 18 =