నేడు హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Union Home Minister Amit Shah To Participate in BJP Maha Padyatra Today in Hyderabad

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. బాబు జగ్జీవన్ రాం (బీజేఆర్) విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు ఈ పాదయాత్ర జరుగనుంది. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కారణంగా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పరిమితులు ఉండనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

  • ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు: వాహనాలను నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లించనున్నారు.
  • జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వైపు: ఎంజే మార్కెట్ వద్ద తాజ్ ఐలాండ్ దిశగా మళ్లింపులు ఉంటాయి.
  • లిబర్టీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు: వాహనాలకు అనుమతి ఉండదు. హిమాయత్‌నగర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • హిమాయత్‌నగర్ నుంచి లిబర్టీ వైపు: పాత అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ మార్గంలో వెళ్లేలా ట్రాఫిక్ మళ్లించనున్నారు.
  • ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు: వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు కూడా రాకపోకలు నిలిపివేయనున్నారు.

రద్దీ ఉండే ప్రాంతాలు

బషీర్‌బాగ్, కింగ్‌కోఠి, బొగ్గులకుంట, అబిడ్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ప్రభావం ఉండవచ్చు. అలాగే లిబర్టీ, రవీంద్రభారతి, బషీర్‌బాగ్, బీజేఆర్ జంక్షన్లను వీలైనంతవరకు నివారించాలని పోలీసులు సూచించారు. ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, జాంబాగ్, తాజ్ ఐలాండ్, నాంపల్లి, అబిడ్స్, రామ్‌కోటి, కోఠి, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది.

ఆర్టీసీ బస్సుల మార్గాల్లోనూ మార్పులు ఉండనున్నాయి. నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు, విమానాశ్రయానికి వెళ్లేవారు ముందుగానే బయలుదేరి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here