దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతుల ప్రారంభం ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం తరగతులపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాత్కాలిక క్యాలెండర్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. యూజీసీ క్యాలెండర్ను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్లో పోస్టు చేశారు. నవంబర్ 1 వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ కొత్త విద్యార్థులకు తరగతులను ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్ 31 నాటికి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలని యూజీసీ అన్ని యూనివర్సిటీలకు సూచించింది.
డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం యూజీసీ 2020-21 అకడమిక్ క్యాలెండర్:
In view of the COVID-19 pandemic, the Commission has accepted the Report of the Committee and approved the @ugc_india Guidelines on Academic Calendar for the First Year of Under-Graduate and Post-Graduate Students of the Universities for the Session 2020-21.
Suggested calendar👇 pic.twitter.com/JPYNhiWb0k
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) September 22, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu