ఏలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

Andhra Pradesh, AP CM YS Jagan, AP News, CM YS Jagan, Development Programmes in Eluru, Eluru, Eluru Development Programmes, Eluru Development Works, Eluru Development Works By YS Jagan, Eluru Latest News, Foundation Stone for Several Development Programmes in Eluru

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బుధవారం నాడు ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరులో రూ.330 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఏలూరు ప్రజలకు తమ్మిలేరు వాగు ముంపు శాశ్వతంగా తప్పించేలా రిటైనింగ్‌వాల్‌ పనులు చేపట్టనున్నారు. అలాగే ఏలూరులో ఇతర ప్రాంతాలలో కూడా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం కోసం రూ.80 కోట్లతో తయారు చేసిన ప్రతిపాదనలను సీఎం జగన్ ఆమోదించారు. శంకుస్థాపనల అనంతరం వీవీనగర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. ఆ తర్వాత ఏలూరు మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, పెదబాబు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. అనంతరం ‌ఏలూరు నుంచి బయలుదేరి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లికి చేరుకున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ