తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 16, శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,666 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా వలన ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1577 కి పెరిగింది.
ఇక గత 24 గంటల్లో 379 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,85,898 కు చేరుకుంది. ప్రస్తుతం 4,191 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో 74 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం నాడు 33,298 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 74,61,687 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,00,475 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ