కొవాగ్జిన్ మూడోదశ ట్రయల్స్‌పై భారత్ బయోటెక్ ప్రకటన, 81% సామర్థ్యం

Bharat Biotech, Bharat Biotech Announced Covaxin, Bharat Biotech Announced Covaxin Shows Interim Vaccine, Bharat Biotech Announced Covaxin Shows Interim Vaccine Efficacy of 81%, Bharat Biotech Covaxin, Bharat Biotech Covaxin Clinical Trials, Bharat Biotech Covaxin Vaccine Distribution, Covaxin Phase 3 Clinical Trials, Covaxin Shows Interim Vaccine Efficacy of 81%, Covaxin Shows Interim Vaccine Efficacy of 81% in Phase 3 Clinical Trials, Mango News

కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ మూడోదశ (పేజ్-3) క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి బుధవారం నాడు భారత్ బయోటెక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో కోవాక్సిన్ 81% మధ్యంతర వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. ఈ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ 25,800 మంది వాలంటీర్లపై నిర్వహించామని, భారతదేశంలో ఇప్పటివరకు నిర్వహించిన సమర్థత ట్రయల్స్ లో ఇదే అతి పెద్దదని పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ దేశంలో అత్యవసర వినియోగం కింద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

కరోనావైరస్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా వ్యాక్సిన్ ఆవిష్కరణలో ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయి అని భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ ఎల్లా కృష్ణ పేర్కొన్నారు. ఈ రోజుతో కొవాగ్జిన్ వ్యాక్సిన్ యొక్క ఫేజ్-1, 2 మరియు 3 క్లినికల్ ట్రయల్స్ డేటాను నివేదించామని చెప్పారు. పేజ్-3 ఫలితాలు అధిక సమర్థత రేటుతో ఆశాజనకంగా ఉన్నాయని, అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్న కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా కోవాక్సిన్ గణనీయమైన రోగనిరోధక శక్తిని చూపిస్తుందని ఎండీ‌ ఎల్లా కృష్ణ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ