ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారౌనత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. “గత కొన్ని రోజులుగా కళ్ళలో మంటలతో నేను అలసిపోయాను మరియు బలహీనంగా ఉన్నాను, హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో శుక్రవారం కరోనా పరీక్ష చేయించుకోగా, ఈ రోజు ఫలితం వచ్చింది, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాను. ఈ వైరస్ తో పోరాడగలనని నాకు తెలుసు. ప్రజలారా దయచేసి మీపై ఏదైనా శక్తిని ఆధిపత్యం చెలాయించే అవకాశం ఇవ్వకండి, మీరు భయపడితే అది మిమ్మల్ని మరింత భయపెడుతుంది. ఇది ఫ్లూ లాంటిది తప్ప మరేమీ కాదు, రండి, కలిసికట్టుగా ఈ కరోనాను నాశనం చేద్దాం” అని కంగనా రౌనత్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ