ఏపీ శాసనమండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం

AP Legislative Council, Governor appoints pro-tem chairman of AP Legislative Council, Mango News, pro-tem chairman of AP Legislative Council, Protem Speaker Of AP Legislative Council, Vitapu Balasubrahmanyam, Vitapu Balasubrahmanyam Appointed as Protem Speaker, Vitapu Balasubrahmanyam Appointed as Protem Speaker Of AP, Vitapu Balasubrahmanyam Appointed as Protem Speaker Of AP Legislative Council

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌గా సీనియర్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. విఠపు బాలసుబ్రహ్మణ్యంను ప్రొటెం చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఏపీ శాసనమండలి చైర్మన్ ఎంఎ షరీఫ్, డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రొటెం చైర్మ‌న్‌ నియామకం చేపట్టారు. ప్రొటెం చైర్మ‌న్‌ గా బాధ్య‌త‌లు చేపట్టినప్పటినుంచి, మండలికి కొత్త చైర్మన్ ను ఎన్నుకునే వరకు విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యుడైన బాలసుబ్రహ్మణ్యం మూడుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ