ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “కార్యనిర్వహణ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కార్య’క్రమం’ అంటే పని చేసే క్రమమని చెప్పారు. ఏపని ముందు చేయాలి, ఏపని వెనుక చేయాలి, ఏపని త్వరగా చేయాలి, ఏది నెమ్మదిగా చేయాలని వరుస వేసుకోవడంలోనే మన సమర్థత వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇