ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ఘర్షణల్లో భారత ఫొటోజర్నలిస్టు డానిశ్‌ సిద్ధిఖీ మృతి

Indian Photojournalist Danish Siddiqui Slayed in Afghanistan

ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ఘర్షణల్లో భారత ఫొటోజర్నలిస్టు డానిశ్‌ సిద్ధిఖీ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా తాలిబన్‌, ఆఫ్ఘాన్ దళాల మధ్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. రాయిటర్స్ వార్తా సంస్థకు దేశంలో చీఫ్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న డానిశ్‌ సిద్ధిఖీ ఆఫ్గాన్‌ లో ఈ ఘర్షణలను కవర్ చేసేందుకు వెళ్లారు. అయితే గురువారం రాత్రి కందహార్ నగరంలో స్పిన్ బోల్డాక్ జిల్లాలో కీలక పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో తాలిబన్లు జరిపిన దాడిలో ఆఫ్ఘాన్ దళాల కాన్వాయ్‌ తో పాటుగా ఉన్న డానిశ్‌ సిద్ధిఖీ మృతిచెందారు.

డానిశ్‌ సిద్ధిఖీ మృతిని భారత్ లోని ఆఫ్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మాముండ్జాయ్ ధ్రువీకరించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “నిన్న రాత్రి కందహార్‌లో స్నేహితుడు డానిష్ సిద్దిఖీ హత్యకు గురైన విషాద వార్తలతో తీవ్ర మనస్తాపం చెందాను. భారత జర్నలిస్ట్ మరియు పులిట్జర్ బహుమతి గ్రహీతైనా డానిష్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఆఫ్ఘాన్ భద్రతా దళాలతో ఉన్నారు. నేను కాబూల్ బయలుదేరే ముందు 2 వారాల క్రితం ఆయనను కలిశాను. అతను ఫోటో జర్నలిజం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ పట్ల తనకున్న అభిరుచి మరియు ప్రేమ గురించి మాట్లాడారు. అతన్ని మిస్ అవుతున్నాను. ఆయన కుటుంబానికి, రాయిటర్స్‌కు నా ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అని ఫరీద్ మాముండ్జాయ్ పేర్కొన్నారు.

ముంబయి నగరానికి చెందిన డానిశ్ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేశాక, టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌ గా వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఫోటో జర్నలిస్టుగా మారారు. 2010 నుంచి ఫొటో జర్నలిస్టుగా రాయిటర్స్‌ వార్తా సంస్థలో పనిచేస్తున్నారు 2018లో రోహింగ్యా శరణార్థులపై చేసిన ఫీచర్‌ ఫొటోగ్రఫీకి గానూ మరికొంతమందితో కలిసి ప్రతిష్టాత్మక పులిట్జర్‌ అవార్డును కూడా డానిష్ సిద్దిఖీ అందుకున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్, ఢిల్లీ అల్లర్లు, నేపాల్ భూకంపాలు, హాంకాంగ్ నిరసనలు, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో యుద్ధ పరిస్థితులను కవర్ చేసి డానిష్ సిద్దిఖీ గుర్తింపు పొందారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 11 =