భారతీయ జనతా పార్టీకి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు రాజీనామా

BJP Leader Motkupalli Narasimhulu Resigns, Mango News, Mothkupalli Narasimhulu quits BJP, Motkupalli Narasimhulu, Motkupalli Narasimhulu Leaves BJP, Motkupalli Narasimhulu Resigned From Bharatiya Janata Party, Motkupalli Narasimhulu Resigned From BJP, Motkupalli Narasimhulu resigns to BJP, telangana, Telangana BJP Leader Motkupalli Narasimhulu Resigns

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజీనామా లేఖను బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు పంపించినట్టు తెలిపారు. రాజకీయాల్లో సంవత్సరాల తన అనుభవాన్ని బీజేపీ పరిగణించలేదని, పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి పేర్కొన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ను బీజేపీలో చేర్చుకునే ముందు తనను సంప్రదించకపోవడం బాధ కల్గించిందని అన్నారు. ఈట‌ల‌ ద‌ళితుల భూముల‌ను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇటీవల సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దళిత సాధికారత సమావేశానికి మోత్కుపల్లి హాజరైన సంగతి తెలిసిందే. బండి సంజయ్‌ కు చెప్పే వెళ్లినా, పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం బాధపెట్టిందన్నారు. తెలంగాణ దళిత బంధు అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని దళితుల పక్షాన అభినందిస్తున్నానని, అందరూ సీఎం కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని కోరారు. మానవత్వం ఉన్న సీఎం కేసీఆర్ ను ఈ జాతి మర్చిపోదని, ఒక చరిత్రకారుడిగా, ఒక అంబేద్కర్ గా మిగిలిపోతారని మోత్కుపల్లి దండోరా వేసి చెప్పారు. మరోవైపు బీజేపీకి రాజీనామా చేయటంతో మోత్కుపల్లి త్వరలోనే టీఆర్ఎస్‌ చేరనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ