బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనాకు కరోనా

BCCI chief Sourav Ganguly’s daughter 3 other family, BCCI President Sourav Ganguly, BCCI President Sourav Ganguly’s Daughter Sana Ganguly Tested Positive, BCCI President Sourav Ganguly’s Daughter Sana Ganguly Tested Positive For Covid-19, Mango News, Sana Ganguly Tested Positive For Covid-19, Sana Ganguly tests Covid positive, Sourav Ganguly’s Daughter Sana Ganguly Tested Positive For Covid-19, Sourav Ganguly’s daughter tests COVID positive

బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీకు కరోనా సోకింది. ఈ మధ్యే సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాక డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అయితే, గంగూలీ తిరిగి వచ్చాక ఆయన కుమార్తె సనాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కానీ, ఆమెలో ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించలేదు. దీంతో, సనా ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. సౌరవ్ గంగూలీకి వచ్చింది కొవిడ్-19 డెల్టా ప్లస్ వేరియెంట్ అని వైద్యులు చెప్పారు. అయితే, గంగూలీ భార్య డోనా గంగూలీకు కూడా కరోనా పరీక్ష చేయగా ఆమెకు నెగిటివ్ వచ్చింది. సౌరవ్ గంగూలీకి ఆసుపత్రిలో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ థెరపీ చేశారు. ఆయన చికిత్స అనంతరం 99 శాతం ఆక్సిజన్ సంతృప్త స్థాయితో పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. గంగూలీ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక ఇప్పుడు కుమార్తె సనాకు కరోనా సోకింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ