తెలంగాణ రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. డిసెంబర్ 13 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు మీ-సేవ కేంద్రాల సేవలు అందుబాటులో ఉండవు. మీ-సేవకు సంబంధించిన డేటాబేస్ అప్ గ్రేడ్, ఇతర ఫీచర్స్ ను మెరుగుపర్చనున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఈనెల 16వ తేదీ వరకు సేవలను బంద్ చేయనున్నట్టు మీ-సేవ కమిషనర్ ప్రకటించారు. తిరిగి 16వ తేదీ ఉదయం నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
[subscribe]