బేబీ సినిమా యూత్‌కు ఎందుకంత నచ్చింది?

What are The Main Reasons Did Youth Likes Recent Hit Telugu Movie Baby,What are The Main Reasons,Youth Likes Recent Hit Baby,Recent Hit Telugu Movie Baby,Youth Likes Recent Movie Baby,Main Reasons of Youth Likes Movie Baby,Mango News,Mango News Telugu,Baby movie,Why did the youth like the movie Baby,Baby,Youth chanting baby,Baby Movie 2023,Baby Telugu Movie Review,Director Sai Rajesh,Impact of Telugu Baby Film,Telugu Movie Baby Latest News,Telugu Movie Baby Latest Updates,Telugu Movie Baby Live News

రిలీజ్‌కు ముందు కనీస అంచనాలు కూడా లేకుండా వచ్చిన బేబీ మూవీ.. ఇప్పుడు బయ్యర్లే షాకయ్యేంత కలెక్షన్లు రాబడుతోంది. యావరేజ్‌ టాక్‌తో అయినా అడ్జస్టయిపోదామనుకున్న మూవీ టీమ్‌కు ఏ మాత్రం ఊహించని సర్ఫ్రైజ్ ఇచ్చింది. చిన్న థియేటరా, మల్టీప్లెక్సా అన్నది కాదు.. బేబీ సినిమా చూశామా లేదా అన్నదే ఆడియన్స్ టార్గెట్‌గా కనిపిస్తోంది. అంతేకాదు చూసిన వాళ్లు కూడా థియేటర్ ముందు క్యూ కడుతూ విజిల్స్‌తో థియేటర్స్‌ను హోరెత్తిస్తున్నారు. వర్షాలు పడుతున్నా.. బేబీ కలెక్షన్ల జోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు. దీంతో ఇంతగా బేబీ మూవీ కనెక్ట్ అవడానికి కారణం ఏంటని పెద్ద పెద్ద డైరక్టర్లు కూడా ఆలోచనల్లో పడుతున్నారు.

ఎండాకాలంలో వర్షాలు వచ్చినట్టు వేసవి సెలవులు అయిపోయి స్కూల్స్, కాలేజీలు శుభ్రంగా నడుస్తున్న టైంలో ఒక కొత్త సినిమా.. డైలీ హౌస్ ఫుల్స్ పడటం అనేది ఆషామాషీ విషయమేమీ కాదు. అది కూడా కాస్తో కూస్తో ఇమేజ్ ఉన్న ఆనంద్ దేవరకొండ తప్ప.. మిగిలిన వారంతా కనీస ఇమేజ్ లేని క్యాస్టింగే నటించారు ఈ మూవీలో. ఆడియన్స్‌ను ఎక్కడ టచ్ చేసిందో తెలీదు కానీ.. క్లాసు మాస్ తేడా లేకుండా రిలీజయిన దగ్గర నుంచి దాదాపు అని సెంటర్లలో సోల్డ్ అవుట్ బోర్డులే కనిపించడంతో బేబీ అసాధ్యాలను సుసాధ్యం చేసిందన్న వాదన వినిపిస్తోంది. కరోనా తర్వాత పెద్ద పెద్ద సినిమాలే థియేటర్ల ముందు బోర్లా పడుతుంటే.. చిన్న సినిమా ఈ రేంజ్‌లో హిట్ టాక్‌తో దూసుకుపోతుంటే.. థియేటర్ ఓనర్లు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. వీకెండ్స్ ఓకే వీక్ డేస్‌లోనూ అదే కలెక్షన్లు రాబడుతూ టోటల్ సినీ ఇండస్ట్రీ చూపును తన వైపు తిప్పేసుకుంది బేబీ.

మూవీ పరంగా చెప్పాలంటే కంటెంట్‌లో కొన్ని ప్లస్‌లు, కొన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ విజయ్ బుల్గానిన్ సంగీత.. వైష్ణవి నటన, ఆనంద్ దేవరకొండ పాత్ర, ఇంటర్వెల్ బ్లాక్, రాత్రి వేళ బిల్డింగ్ పైన హీరో హీరోయిన్ తిట్టుకునే సన్నివేశం, హీరోయిన్ తల్లి పాత్ర చాలామందిని ఆకట్టుకుంది. అంతేకాదు ఒకరిని మనసారా ప్రేమించి.. ఇంకొకరిని పరిస్థితుల వల్ల ప్రేమించాల్సి వచ్చి.. ఇంకొరిని పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ ‌పాతదే అయినా కొత్తగా చూపించడం చాలామంది ఆడియన్స్‌ను మూవీకి కనెక్ట్ చేసేలా చేసింది. ప్రేమిస్తున్నా పాట కోసమే మరికొంతమంది ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నారన్న టాక్ కూడా ఉంది. తమ రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉన్న విషయాలను.. అంత లోతుగా చూపించడంతో చాలామంది కుర్రాళ్లు బేబీని మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

కాలేజీలో అటెండెన్స్ తగ్గినా.. బేబీ మాత్రం చూడాల్సిందే అన్న ఆలోచనలో ఎక్కువ మంది యూత్ ఉన్నారు. స్నేహితులు, ప్రేమికులే కాదు.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా బేబీ సినిమా మంత్రమే పటిస్తున్నారు.ప్రేమలో ఉన్నోళ్లే కాదు, బ్రేకప్ లవర్స్, ఫ్రెష్ గా లవ్ లో పడ్డవాళ్లు, ప్రేమంటే ఆమడ దూరం పరిగెట్టే వాళ్లు కూడా ఎవరికి వారు రీజన్స్ పెట్టుకుని బేబీ చూస్తున్నారు. నిజానికి మొన్న ఆర్ ఎక్స్ 100 అయినా.. ఇప్పుడు బేబీలో అయినా అమ్మాయిదే తప్పు అనేలా చూపించారు. ఇన్నాళ్లు అమ్మాయిలను ఈ టైప్‌లో చూపిస్తే ఆడియన్స్ అసలు ఒప్పుకుంటారా అనే ఆలోచనల్లో ఉన్న దర్శక, నిర్మాతలకు ఆర్ఎక్స్ 100 రూట్ క్లియర్ చేసేసినట్లయింది. ఇప్పుడు దాదాపు అలాగే హీరోయిన్‌ క్యారెక్టర్‌ను.. తప్పుగా చూపించడంతో చాలామంది యూత్ కనెక్ట్ అయిపోయారు. నిజమే ప్రేమ మోసాల్లో అమ్మాయిలదీ, అబ్బాయిలదీ ఇద్దరిదీ తప్పుంటుంది. కానీ ఇన్ని రోజులూ అబ్బాయిల మోసాన్ని హైలెట్ చేస్తూ వచ్చిన డైరక్టర్స్.. సడన్ ట్రాక్‌లో అమ్మాయిలను మోసాన్ని చూపించడం ఆడియన్స్‌ కొత్తగా తీసుకున్నారు. ఇక కొంతమంది అబ్బాయిలు అయితే తమకు ఏం కావాలో అదే చూపించారంటూ ఎగిరి గంతేస్తున్నారు. మొత్తానికి బేబీ మూవీ ప్రేక్షుకుల పల్స్‌ను గట్టిగానే పట్టేసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =