అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan, AP CM YS Jagan Participates in Gokul Kshetram Bhumi Puja Programme, AP CM YS Jagan Participates in Gokul Kshetram Bhumi Puja Programme at Kolanukonda, AP Politics, Gokul Kshetram Bhumi Puja, Gokul Kshetram Bhumi Puja Programme, Kolanukonda, YS Jagan, YS Jagan Latest News, YS Jagan Participates in Gokul Kshetram Bhumi Puja, YS Jagan Participates in Gokul Kshetram Bhumi Puja Programme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ఆహారాన్ని ఇక్కడే తయారు చేయనున్నారు. గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడినుంచే సరఫరా కానుంది. అక్షయపాత్ర కిచెన్‌ ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ త‌యారు చేసిన భోజ‌న ప‌దార్థాల‌ను సీఎం వైఎస్ జగన్ స్వ‌యంగా విద్యార్థుల‌కు వడ్డించారు.

అనంతరం తాడేపల్లి మండలంలోని కొలనుకొండ చేరుకొని ఇస్కాన్ ఏర్పాటు చేస్తున్న హరేకృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్ జగన్ భూమి పూజ నిర్వహించారు. ఇస్కాన్‌ తరపున ఏపీలో ఏర్పాటు కానున్న అతిపెద్ద క్షేత్రం ఇదే కాగా, దీనిని రూ.70 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాలను నిర్మిస్తున్నారు. ఆలయాలతో పాటుగా యోగ ధ్యాన కేంద్రాలు, కళా క్షేత్రం, యువత కోసం శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ