ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, భూమి పత్రాలు అందజేసిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే

Minister Aditya Thackeray Handed over Land Document to TTD Chairman To Construct Temple at Navi Mumbai, Minister Aditya Thackeray Handed over Land Document to TTD Chairman, TTD Chairman To Construct Temple at Navi Mumbai, Temple at Navi Mumbai, Navi Mumbai, TTD Chairman, Minister Aditya Thackeray, Maharashtra govt offers 10 acres land to TTD, Maharashtra Tourism Minister Aditya Thackeray on Saturday handed over the Land Document to TTD Chairman, Maharashtra Tourism Minister Aditya Thackeray, Minister Aditya Thackeray, Maharashtra Tourism Minister, Tourism Minister Aditya Thackeray, Aditya Thackeray hands over documents of land to TTD Chairman To Construct Temple at Navi Mumbai, Mango News, Mango News Telugu,

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే తనయుడు, టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం నేవీ ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మంత్రి ఆదిత్య థాకరే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరుగుతున్న టీటీడీ బోర్డు సమావేశంలో టీటీడీ ఈవో, సభ్యులు, అధికారుల సమక్షంలో 10 ఎకరాలకు చెందిన భూమి పత్రాలను వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.

అదేవిధంగా రేమండ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ గౌతమ్ సింఘానియా తరపున, ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని రేమండ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ సరిన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిత్య థాకరే మరియు సంజీవ్ సరిన్‌లను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సత్కరించారు. భూమి కేటాయించనందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చిన రేమండ్ ఎండీ సింఘానియాకు వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 13 =